Telugu Global
Cinema & Entertainment

Kannappa Movie | ఇకపై ప్రతి సోమవారం అప్ డేట్

Kannappa Movie - మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ సినిమా టీజర్ ను ఈరోజు లాంఛ్ చేశారు.

Kannappa Movie | ఇకపై ప్రతి సోమవారం అప్ డేట్
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ సినిమా టీజర్ ను ఈరోజు లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన మంచు విష్ణు, ఇకపై సినిమాకు సంబంధించి ప్రతి సోమవారం అప్ డేట్ ఇస్తామని ప్రకటించాడు.

"ఇకపై ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి అప్డేట్ వస్తూనే ఉంటుంది. ఇది నా వర్షెన్‌లో రాసుకున్న ‘కన్నప్ప’. అందుకే వరల్డ్ ఆఫ్ కన్నప్ప అని అందరినీ ఆహ్వానించాం. నేను రెండో శతాబ్దం కథను చెబుతున్నాను. దానికి తగ్గట్టుగా ఉండాలనే న్యూజిలాండ్ లొకేషన్‌లో సినిమాను తీశాం. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తున్నామని ముందుకు వెళ్లాం."

కన్నప్ప తన బిడ్డలాంటిదంటున్నాడు విష్ణు. కన్నప్ప కోసం ఇంత మంది ఆర్టిస్టులని ఎందుకు తీసుకున్నామనేది సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుందని.. తను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అన్నాడు.

ఇక కన్నప్ప సినిమాలో తనకు, ప్రభాస్ కు మధ్య కాంబినేషన్ సీన్లు లేవని స్పష్టం చేశాడు. మరో 2-3 నెలల్లో ప్రభాస్ లుక్ కూడా రివీల్ చేస్తామన్నాడు.

First Published:  14 Jun 2024 5:48 PM GMT
Next Story