Telugu Global
Cinema & Entertainment

విశ్వామిత్రగా మంచు మోహన్ బాబు

కెరీర్ లో తొలిసారి ఓ సైకియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్నారు మోహన్ బాబు. ఆ సినిమా పేరు అగ్నినక్షత్రం.

Manchu Mohan Babu
X

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేశారు. తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నారు మోహన్ బాబు. ఇదొక సైకియాట్రిస్ట్ పాత్ర.

ప్రొఫెసర్ విశ్వామిత్ర క్యారెక్టరైజేషన్ లోకి వెళ్తే.. తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల... డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్ ప్రొఫెసర్. గంభీరమైన లుక్ తో మోహన్ బాబు ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ఈ సినిమాలో అలరించబోతున్నారని లుక్ ని చూస్తే అర్ధమవుతోంది.

ఫస్ట్ టైమ్ మోహన్ బాబు, మంచు లక్ష్మీ కలిసి నటిస్తున్న సినిమా ఇది. విలక్షణ నటుడు సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మలయాళ నటుడు సిద్దిక్ విలన్ గా నటిస్తున్నాడు.

చైత్ర శుక్ల ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుండగా, విశ్వంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. లిజో కె జోస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ఓటీటీ కోసం నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.



First Published:  1 Aug 2022 2:23 AM GMT
Next Story