Malavika Nair - ఫ్లాప్ వస్తే పర్సనల్ గా తీసుకోదంట
Malavika Nair reacts on her career flops - ఫ్లాప్స్ ను పర్సనల్ గా తీసుకోనంటోంది హీరోయిన్ మాళవిక నాయర్. కథ కొత్తగా ఉందా లేదా అనేది మాత్రమే చూస్తానంటోంది.

పని చేయడం వరకు మాత్రమే మన పని. సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది మన చేతిలో ఉండదు. చాలామంది హీరోలు చెప్పే మాట ఇది. మూవీ ఫ్లాప్ అయితే 3 రోజులు బాధపడతామని, సోమవారం నుంచి మళ్లీ నార్మల్ అయిపోతుందని చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని హీరోయిన్ మాళవిక నాయర్ కూడా చెబుతోంది.
"కొన్ని మన చేతుల్లో వుండవు. నటన నా కంట్రోల్ ఉంటుంది. కథలు, ఫిల్మ్ మేకర్స్ ని ఎంచుకోవడం నా చేతుల్లో ఉంటుంది. కానీ కొన్ని సార్లు వర్క్ అవుట్ కాకపోవచ్చు. దాన్ని పర్సనల్ గా తీసుకోను."
హిట్ ఫ్లాప్ సంగతి పక్కనపెడితే.. ఒక నటిగా పాత్ర చేస్తున్నానంటే కొత్తదనం చాలా ముఖ్యమని, అది లేకుండా సినిమా చేయలేనని ప్రకటించింది మాళవిక. ప్రతి సినిమా ఒకేలా ఉంటే బోర్ కొడుతుందని... అందరూ చేస్తున్నారు కదా.. అందులో నేను చేసేది ఏముంది అనే ఫీలింగ్ వస్తుందని తెలిపింది.
ఈమె హీరోయిన్ గా నటించిన అన్ని మంచి శకునములే సినిమా విడుదలకు సిద్ధమైంది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది.