Mahesh-Rajamouli | మహేష్ తో వర్క్ షాప్ మొదలుపెట్టిన రాజమౌళి
Mahesh-Rajamouli - రాజమౌళి సినిమా పని మొదలుపెట్టాడు మహేష్ బాబు. సినిమా కోసం జర్మనీలో వర్క్ షాప్ కు హాజరయ్యాడు.
గుంటూరుకారం సినిమా ఇలా పూర్తయిందో లేదో అలా తన నెక్ట్స్ సినిమా పని మొదలుపెట్టాడు మహేష్ బాబు. స్టార్ డైరక్టర్ రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు ఈ హీరో. దీని కోసం దర్శకుడు, హీరో కలిసి వర్క్ షాప్ మొదలుపెట్టారు.
తను ఏ సినిమా చేసినా, దానికి సంబంధించి వర్క్ షాప్ నిర్వహిస్తాడు రాజమౌళి. బాహుబలి కోసం ప్రభాస్-రానాను సిద్ధం చేశాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ను సిద్ధం చేశాడు. ఇప్పుడు కొత్త సినిమా కోసం మహేష్ ను రెడీ చేసే పనిలో పడ్డాడు.
అయితే రాజమౌళి గత సినిమాల తరహాలో మహేష్ బాబు ఫిజికల్ గా సిద్ధం అవ్వడం లేదు. ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి టెక్నాలజీని వాడబోతున్నారు. ఆ టెక్నాలజీపై అవగాహన కోసం మహేష్ బాబు వర్క్ షాప్ చేస్తున్నాడు.
దీని కోసం రాజమౌళి, మహేష్ కలిసి జర్మనీ వెళ్లాడు. అక్కడ కొన్ని రోజుల పాటు వర్క్ షాప్ లో పాల్గొంటారు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత అప్పుడు ఫిజికల్ మేకోవర్ అవుతారు. ఈ రెండు పనులు పూర్తి చేసి, ఉగాది నుంచి సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నారు.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ తో సినిమా చేయబోతున్నాడు రాజమౌళి. దీనికోసం ఓ ప్రత్యేకమైన టెక్నాలజీని వాడబోతున్నారు. రెగ్యులర్ గా ఉండే విజువల్ ఎఫెక్టులకు ఏఐ టెక్నాలజీని జోడించబోతున్నారు. ఈ టెక్నాలజీపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకున్న తర్వాత షూట్ కు వెళ్తారు