Mahesh babu | ముఫాసా కోసం మహేష్ బాబు
Mahesh babu Mufasa - ముఫాసా సినిమా కోసం మహేష్ ముందుకొచ్చాడు. మెయిన్ లీడ్ కు డబ్బింగ్ చెప్పాడు.
అల్టిమేట్ జింగిల్ కింగ్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ గొప్పదనాన్ని సెలబ్రేట్ చేసుకునే టైమ్ వచ్చేసింది. 2019లో లైవ్-యాక్షన్ డ్రామాగా వచ్చిన ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా మరింత అద్భుతమైన చిత్రంగా ముఫాసా: ది లయన్ కింగ్ విడుదలకు సిద్ధమైంది.
డిసెంబర్ 20న ఈ సినిమాను భారీ ఎత్తున వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నారు. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నాడు. ఆయనతో పాటు ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా మరోసారి ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
ఈ అద్భుతమైన అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ... "లయన్ కింగ్ స్టోరీ టెల్లింగ్ నాకెంతో ఇష్టం, ముఫాసా పాత్ర తన కొడుకును నడిపించే ప్రేమగల తండ్రిగా మాత్రమే కాకుండా అడవికి రారాజు. డిస్నీతో ఈ అసోసియేషన్ వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్. డిసెంబర్ 20న తెలుగులో బిగ్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు చూస్తారని ఎదురు చూస్తున్నాను" అన్నారు.
ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది. మహేష్ డబ్బింగ్ తో ఈ సినిమాకు టాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరిగింది.