సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు అందించిన మహేశ్‌బాబు
ఈ మేరకు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు
BY Raju Asari23 Sept 2024 1:54 PM IST

X
Raju Asari Updated On: 23 Sept 2024 1:54 PM IST
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయనిధికి ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు, నమత్ర దంపతులు రూ. 50 లక్షలు విరాళం అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి విరాళం చెక్కు అందజేశారు. ఏఎంబీ తరఫున మరో రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు.
వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్‌సేన్, సాయి ధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయ నిధికి తమ వంతు సాయం అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా సీఎం సహాయ నిధికి విరాళం అందజేశారు.
Next Story