Maharshi Raghava | 100 సార్లు రక్తందానం చేసిన మహర్షి
Maharshi Raghava - చిరంజీవి బ్లడ్ బ్యాంకులో వంద సార్లు రక్తం దానం చేసి రికార్డ్ సృష్టించారు మహర్షి రాఘవ.

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్తనిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెడుతోంది ఈ బ్లడ్ బ్యాంక్. దీనికి అండదండలు అందిస్తోన్న ప్రధాన వ్యక్తులు మెగా అభిమానులు మాత్రమే.
వందలాది మెగాభిమానులు అందిస్తోన్న సపోర్ట్‌తో చిరంజీవి బ్లడ్ బ్యాంకు నిరంతర సేవలను అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంకుకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతల్లో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు.
మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీ మోహన్.. రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావటం విశేషం.
ఇప్పుడు మహర్షి రాఘవ 100వసారి రక్తదానం చేయటం గొప్ప రికార్డు. 100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు కచ్చితంగా నేను కూడా వస్తాను అని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు. అయితే అనుకోకుండా 100వ సారి మహర్షి రాఘవ రక్తదానం చేసే సమయంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.
హైదరాబాద్ వచ్చిన ఆయన విషయం తెలుసుకుని మహర్షి రాఘవను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.
ఆయనతో పాటు ఇదే సందర్భంలో మొదటిసారి రక్తదానం చేసిన మురళీ మోహన్‌ను కూడా కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. మహర్షి రాఘవను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.