Telugu Global
Cinema & Entertainment

మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్...వరుడు ఎవరంటే?

ప్రముఖ నటి కీర్తి సురేశ్ చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు

మహానటి కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్...వరుడు ఎవరంటే?
X

ప్రముఖ నటి కీర్తి సురేశ్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్‌తో వచ్చే నెలలో గోవాలో ఆమె పెళ్లి జరగనుందని కీర్తి తండ్రి సురేశ్‌కుమార్ క్లారిటీ ఇచ్చినట్లు డెక్కన్ క్రానికల్ తెలిపింది. కీర్తి, తటిల్ స్కూల్ డేస్ నుంచే మంచి స్నేహితులని, వీరి అనుబంధం దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. డిసెంబర్ 11న లేదా 12న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారని తెలిపింది.

తటిల్ కేరళకు చెందిన వ్యాపార వేత్త కీర్తి, ఆంథోనీ ఒకే స్కూళ్లో చదువుకున్నారు. దాదపు రూ.300 కోట్లు ఆస్తులు ఉన్నాయని సమాచారం.ఇందుకోసం గోవాలో ఓ పెద్ద రిసార్ట్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇరుకుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం పలకనున్నారని వివరించింది త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సురేశ్ చెప్పారట. దీంతో కీర్తి సురేశ్ అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. కీర్తి, తటిల్ ల ఫొటోలు షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  22 Nov 2024 2:42 PM IST
Next Story