Macherla Niyojakavargam OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో హిట్
Macherla Niyojakavargam OTT: నితిన్ హీరోగా నటించిన సినిమా ఇది. థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఓటీటీలో మాత్రం పెద్ద హిట్.
నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. రొటీన్ కంటెంట్ ను ప్రేక్షకులు తిరస్కరించారు. అలా నితిన్ విజయాలకు బ్రేక్ పడింది. అయితే ఇదే సినిమా ఇప్పుడు నితిన్ కు ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే, ఓటీటీలో మాచర్ల నియోజకవర్గం పెద్ద హిట్ అయింది.
నితిన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సముద్ర ఖని, క్యాథరిన్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, జయప్రకాష్, వెన్నెల కిషోర్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీ మాధ్యమంలో ఆడియెన్స్‌ని అలరిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్ వచ్చాయి. ఇది చాలా పెద్ద నంబర్.
సిద్ధార్థ్ రెడ్డి (నితిన్) సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. గుంటూరు జిల్లాలోని మాచర్లకు చెందిన స్వాతి తన నియోజక వర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై సాయం కోసం ఎదురు చూస్తుంటుంది. రాజప్ప (సముద్ర ఖని) మాచర్ల నియోజక వర్గంలో ఎన్నికలు జరగకుండా చూస్తుంటాడు. అలాంటి వ్యక్తికి ఎదురెళుతుంది స్వాతి. ఆమె చంపటానికి రాజప్ప ప్రయత్నిస్తాడు. స్వాతిని సిద్ధార్థ్ కాపాడుతాడు. రాజప్ప గురించిన నిజం అతనికి తెలుస్తుంది. అదే సమయంలో అతనికి గుంటూరు జిల్లాకే కలెక్టర్‌గా పోస్టింగ్ వస్తుంది. అప్పటి వరకు జరిగిన పోరాటం ఇంకా ఉధృతంగా మారుతుంది. చివరకు రాజప్పను సిద్ధార్థ్ ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా. స్వర సాగర్ మహతి ఇటు క్లాస్, అటు మాస్ ఆడియెన్స్‌ను అలరించేలా సంగీతాన్ని అందించాడు.
ఎం.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి జీ5లో మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే జీ తెలుగు ఛానల్ లో ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారు.