Telugu Global
Cinema & Entertainment

Actress Hema | 'మా' నుంచి సస్పెండ్ అయిన హేమ

MAA suspends Actress Hema - నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డ్రగ్స్ కేసులో ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

Actress Hema | మా నుంచి సస్పెండ్ అయిన హేమ
X

బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన హేమకు మరో ఎదురుదెబ్బ తలిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నాడు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కీలక సభ్యురాలిగా కొనసాగుతున్నారు హేమ. అసోసియేషన్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆమె వివాదాలతో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నారు. అలాంటి సభ్యురాల్ని, అసోసియేషన్ తాత్కాలికంగా బహిష్కరించింది.

బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న వ్యక్తుల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలు నిర్వహించగా.. 86 మందికి పాజిటివ్ అని తేలింది. అందులో హేమ కూడా ఒకరు. ఇదే విషయంపై అసోసియేషన్ హేమను వివరణ కోరింది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

దీంతో క్రమశిక్షణ చర్యల కింద హేమను సస్పెండ్ చేశారు. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్న తర్వాత తిరిగి అసోసియేషన్ లోకి తీసుకుంటామని తెలిపారు. అంతకంటే ముందు, హేమ వ్యవహారంపై సభ్యుల అభిప్రాయాలు కోరాడు అధ్యక్షుడు మంచు విష్ణు. టెస్టుల్లో పాజిటివ్ గా తేలిన హేమపై చర్యలు తీసుకొని, అసోసియేషన్ గౌరవాన్ని, పారదర్శకతను కాపాడాలని ఎక్కువమంది సూచించడంతో మంచు విష్ణు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

First Published:  6 Jun 2024 4:25 PM GMT
Next Story