Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: `లవ్ యూ నాన్న.. మీరే నా సూపర్ స్టార్`.. మ‌హేష్‌బాబు భావోద్వేగ ట్వీట్

కృష్ణ అంటే మహేష్ బాబుకు అపార ప్రేమ. పలు బహిరంగ వేదికలపై తనకు తన తండ్రి అంటే ఎంత ఇష్టమో మహేష్ బాబు వెల్లడించాడు. కృష్ణ కూడా మహేష్ చిత్రాల ఆడియో ఫంక్షన్స్ లో, విజయోత్సవ సభల్లో తరచూ పాల్గొని, మహేష్ ని ఉత్సాహపరిచేవాడు.

Mahesh Babu: `లవ్ యూ నాన్న.. మీరే నా సూపర్ స్టార్`.. మ‌హేష్‌బాబు భావోద్వేగ ట్వీట్
X

టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణం ఆయన కుమారుడు మహేష్ బాబుకు తీరని శోకాన్ని మిగిల్చింది. 2022 సంవత్సరంలో మహేష్ కుటుంబాన్ని వరుసగా విషాదాలు వెంటాడాయి. అనారోగ్యం కారణంగా ఆయన సోదరుడు రమేష్ బాబు అకాల మరణం చెందగా, రెండు నెలల కిందటే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. ఈ విషాదాల నుంచి మహేష్ బయటపడక ముందే తండ్రిని కోల్పోయాడు. దీంతో మహేష్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

కృష్ణ అంటే మహేష్ బాబుకు అపార ప్రేమ. పలు బహిరంగ వేదికలపై తనకు తన తండ్రి అంటే ఎంత ఇష్టమో మహేష్ బాబు వెల్లడించాడు. కృష్ణ కూడా మహేష్ చిత్రాల ఆడియో ఫంక్షన్స్ లో, విజయోత్సవ సభల్లో తరచూ పాల్గొని, మహేష్ ని ఉత్సాహపరిచేవాడు. ఇదిలా ఉండగా తన తండ్రి మరణం తర్వాత తొలిసారి మహేష్‌బాబు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన తండ్రిని తలచుకున్నారు.

'మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ఎంతో చురుకైన స్వభావం మీది. మీరే నా స్ఫూర్తి, ధైర్యం. గతంలో ఎన్నడూ లేనంతగా ధైర్యంగా ఉన్నా. ఇప్పుడు మీలాగే నిర్భయంగా ఉన్నాను. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తా. మీరు గర్వపడేలా చేస్తా. లవ్ యూ నాన్న. మీరే నా సూపర్ స్టార్' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. తన తండ్రిని తలచుకుంటూ మహేష్ చేసిన భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First Published:  24 Nov 2022 4:32 PM IST
Next Story