Telugu Global
Cinema & Entertainment

Love Me | సైలెంట్ గా స్ట్రీమింగ్

Love Me - ఆశిష్ హీరోగా నటించిన సినిమా లవ్ మీ. ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

Love Me If You Dare Review: లవ్ మీ ఇఫ్ యూ డేర్ –రివ్యూ! {1.75 /5}
X

హిట్టయిన సినిమాలు ఆర్భాటంగా ఓటీటీలోకి వస్తాయి. వాటికి మరోసారి ప్రచారం కల్పిస్తాయి ఓటీటీ సంస్థలు. అదే టైమ్ లో ఫ్లాప్ అయిన సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తాయి. అవి ఓటీటీలోకి వచ్చినట్టు కూడా చాలామందికి తెలియదు. ఇప్పటికే ఎన్నో సినిమాలు అలా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు మరో సినిమా వచ్చింది. దాని పేరు లవ్ మి.

దిల్ రాజు కుటుంబానికి చెందిన ఆశిష్ హీరోగా నటించిన సినిమా ఇది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. దీంతో సినిమాను విడుదలైన 3 వారాలకే సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు పెట్టేశారు.

ఈ సినిమాను ఇలా స్ట్రీమింగ్ కు పెట్టడం వెనక మరో రీజన్ కూడా కనిపిస్తోంది. విడదలైన 2-3 వారాలకే ఇలా స్ట్రీమింగ్ కు ఇవ్వడం వల్ల థియేట్రికల్ వ్యవస్థ దెబ్బతింటోందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చినప్పుడు ఇలానే ఆందోళన చెలరేగింది.

లవ్ మీ విషయంలో ఈ గొడవ మరోసారి తెరపైకొస్తుందనే ఆలోచనతో, ఇలా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు తెచ్చి ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆశిష్ హీరోగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. కంటెంట్ ఫెయిలైనా సినిమాలో పాటలు, విజువల్స్ చాలా బాగుంటాయి. ఓ లుక్కేయొచ్చు.

First Published:  15 Jun 2024 10:48 PM IST
Next Story