Telugu Global
Cinema & Entertainment

లవ్‌ ప్రపోజల్‌ రిజెక్ట్‌ చేశానని గదిలో బంధించారు : నటి అంజలి నాయర్

దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్‌ తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది.

లవ్‌ ప్రపోజల్‌ రిజెక్ట్‌ చేశానని గదిలో బంధించారు : నటి అంజలి నాయర్
X

కోలీవుడ్ నటి అంజలి నాయర్ తన సినీ కేరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వూలో పంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఓ దర్మకుడు తనను ఎంతలా వేధించడో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్‌ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్‌గానూ నటించాడు. తన ప్రపోజల్‌ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్‌కు వచ్చి వేధింపులకు గురి చేశాడని నటి ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్‌ చేసి ఆమె తల్లి హెల్త్ బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది. నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు.

ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్‌ లెటర్‌ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్‌ మూవీలో నేనే హీరోయిన్‌గా నటించాలని కాంట్రాక్ట్‌ పేపర్‌పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది. నేను మూవీ చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్‌ లెటర్స్‌ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్‌ లెటర్‌ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది.

First Published:  20 Jan 2025 6:12 PM IST
Next Story