Telugu Global
Cinema & Entertainment

సినిమా తెలుగులో తీసి, పాటలు హిందీలో చేశారంట

తెలుగు, హిందీ భాషల్లో సమాంతరంగా తెరకెక్కింది లైగర్ మూవీ. అయితే ఈ సినిమాలో పాటల్ని మాత్రం పూర్తిగా హిందీలో తీశారు.

సినిమా తెలుగులో తీసి, పాటలు హిందీలో చేశారంట
X

వీటిని పాన్ ఇండియా కష్టాలు అంటారు. పూర్తిస్థాయిలో పాన్ ఇండియా సినిమా తీయడం చాలా కష్టం. అందుకే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతారు. మరీ ముఖ్యంగా సాంగ్స్ విషయంలో మేకర్స్ కు ఈ వెసులుబాటు ఎక్కువ. ఓ వెర్షన్ లో సాంగ్ తీసి, మిగతా వెర్షన్ ఆడియోలు యాడ్ చేసేస్తుంటారు. లైగర్ కూడా ఇదే జరిగింది. కాకపోతే రివర్స్.

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది లైగర్ సినిమా. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. అయితే సాంగ్స్ మాత్రం పూర్తిగా హిందీలోనే తీశారట. వాటికి తెలుగు లిరిక్స్ యాడ్ చేశారంట.

"లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే హిందీలా కనిపిస్తుందనే చర్చ మన తెలుగు ఆడియన్స్ లో ఉంది. దాన్ని నేను అర్ధం చేసుకుంటా. ఇందులో పాటలు చేసింది హిందీ కంపోజర్స్. షూట్ చేసినపుడు, హిందీ వెర్షన్ మీదే షూటింగ్ చేశాం. పాటలు హిందీలో చేశాం. సినిమా మాత్రం పక్కా తెలుగు. హిందీలో తెలుగులో రెండిట్లో షూట్ చేశాం. సినిమా చూసినప్పుడు పూర్తిగా తెలుగు సినిమాని ఫీలౌతారు. లైగర్ మన సినిమా. మన సినిమాని ఇండియాకి చూపిస్తున్నాం."

ఇలా పూర్తి క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. కథ నెరేషన్ జరిగినప్పుడే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తీయాలని అనుకున్నారట. ఆ తర్వాత మైక్ టైసన్ లాంటి లెజెండ్స్ వచ్చి చేరారని, ఇక హీరోయిన్ అనన్య పాండేను నెరేషన్ టైమ్ లోనే అనుకున్నామని చెబుతున్నాడు విజయ్ దేవరకొండ.

First Published:  16 Aug 2022 9:22 AM IST
Next Story