Leo Movie | స్ట్రీమింగ్ లో కనిపించని విజయ్ సినిమా
Leo Movie - విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా విజయ్. లెక్కప్రకారం ఈరోజు ఈ సినిమా స్ట్రీమింగ్ కు రావాలి. కానీ అలా జరగలేదు.
లెక్కప్రకారం ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కు రావాలి లియో సినిమా. కానీ ఈ సినిమా స్ట్రీమింగ్ వాయిదా పడింది. దీనికి కారణం ఏంటనేది తెలియరాలేదు. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 23 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో లియో స్ట్రీమింగ్ కు వస్తుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వారం స్ట్రీమింగ్ వివరాల్ని ప్రకటించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఆశ్చర్యకరంగా అందులో లియో సినిమా లేదు. దీంతో మరోసారి విజయ్ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. థియేట్రికల్ వెర్షన్ కు, ఓటీటీ వెర్షన్ కు తేడా చూపిస్తున్నారు. థియేట్రికల్ వెర్షన్ తో పోలిస్తే, అదనంగా 18 నిమిషాల కొత్త సన్నివేశాల్ని ఓటీటీ వెర్షన్ కోసం జోడించారు. అందుకే లియో స్ట్రీమింగ్ కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వాయిదా పడింది. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించలేదు.
థియేట్రికల్ సక్సెస్ పరంగా ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. వసూళ్ల వరంగా లియో అదరగొట్టింది. కోలీవుడ్ ఆల్ టైమ్ టాప్-4 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.