Telugu Global
Cinema & Entertainment

రుద్రుడు విడుదల తేదీ ఫిక్స్

రుద్రుడు సినిమాలో నటిస్తున్నాడు లారెన్స్. మూడేళ్ల విరామం తర్వాత లారెన్స్ నుంచి వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ మూవీకి విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

రుద్రుడు విడుదల తేదీ ఫిక్స్
X

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ 'రుద్రుడు'. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు. వేసవిలో ఏప్రిల్ 14న థియేటర్లలోకి వస్తున్నాడు రుద్రుడు.

ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో లారెన్స్ తలకు గాయంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి.. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటెడ్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

లారెన్స్ నటించిన కాంచన-3 థియేటర్లలోకి వచ్చి మూడేళ్లయింది. మళ్లీ ఇన్నేళ్లకు అతడి నుంచి రుద్రుడు సినిమా వస్తోంది. ముందుగా క్రిస్మస్ రిలీజ్ అనుకున్నారు. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. దీంతో కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

రుద్రుడు సినిమాను తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాతీయ అవార్డ్ గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  2 Oct 2022 4:33 PM IST
Next Story