Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్ ను గుర్తుచేసిన లారెన్స్

చూడ్డానికి అచ్చం రజనీకాంత్ లా కనిపిస్తున్నాడు నటుడు కమ్ దర్శకుడు లారెన్స్. తన కొత్త సినిమాలో లారెన్స్ లుక్ ఇది.

రజనీకాంత్ ను గుర్తుచేసిన లారెన్స్
X

కరోనా ఎఫెక్ట్ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు హీరో రాఘవ లారెన్స్. దాదాపు మూడేళ్లుగా ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రుద్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో రుద్రన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో రుద్రుడు పేరుతో రిలీజ్ చేస్తున్నాడు.

యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. శరత్‌ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ కొన్ని ఎక్స్ క్లూజివ్ ఫోటోలు రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలలో బ్లాక్ డ్రెస్ తో లారెన్స్ అదరగొడుతున్నాడు. ఆయన లుక్ రజనీకాంత్ ను గుర్తు చేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

రజనీకాంత్ అంటే లారెన్స్ కు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. రజనీని తన దేవుడిగా, గురువుగా భావిస్తుంటాడు ఈ దర్శకుడు కమ్ నటుడు. తాజా సినిమాలో గెటప్ అచ్చం రజనీకాంత్ లా ఉందని అంతా అంటుంటే, లారెన్స్ హ్యాపీ ఫీలవుతున్నాడు.

First Published:  23 Sept 2022 8:18 AM IST
Next Story