Lavanya Tripathi | కొణెదల గ్యాంగ్ లో చేరిన మెగా కోడలు
Lavanya Tripathi - పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటిపేరు మారడం సహజం. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే పని చేసింది.

Varun Tej, Lavanya Tripathi Engagement: రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం
లావణ్య త్రిపాఠి.. ఇన్నాళ్లూ మనందరికి ఈ హీరోయిన్ ఇలానే తెలుసు. ఇప్పుడీ ముద్దుగుమ్మ పేరు మారింది. ప్రస్తుతం ఆమె పేరు లావణ్య త్రిపాఠి కొణెదల. ఈ మేరకు తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ లో పేరు మార్చుకుంది లావణ్య.
మెగా హీరో వరుణ్ తేజ్ ను లావణ్య త్రిపాఠి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారడం సంప్రదాయం. ఆ సంప్రదాయన్ని గౌరవిస్తూ, లావణ్య త్రిపాఠి కూడా తన ఇంటిపేరు లావణ్య త్రిపాఠి కొణెదలగా మార్చుకుంది. ఈ విషయంలో ఆమె ఉపాసన కొణెదలను ఫాలో అయింది.
రామ్ చరణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఉపాసన ఇంటిపేరు కూడా మారింది. అయితే ఆమె పూర్తిగా తన పేరును మార్చుకోలేదు. తన ఇంటి పేరును అలానే ఉంచి, కొణెదల పేరు తగిలించింది. ఉపాసన కామినేని కొణెదలగా కొనసాగుతోంది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే పద్ధతిలో తన పేరు మార్చుకుంది.
ప్రస్తుతం లావణ్య, హైదరాబాద్ లో వరుణ్ తేజ్ ఇంటికే పరిమితమైంది. ఎలాంటి షూటింగ్స్ చేయడం లేదు. మెగా కాంపౌండ్ లోని వ్యక్తులందరితో ఆమె టచ్ లో ఉంది. పైగా తన బెస్ట్ ఫ్రెండ్ నిహారిక కూడా ఇంట్లోనే ఉంటోంది. భర్తకు విడాకులిచ్చిన నిహారిక, పుట్టింటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. అలా లావణ్య-నిహారిక ఒకే ఇంట్లో ఉంటున్నారు.