ఆస్కార్ బరిలో 'లాపతా లేడీస్'
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటి. స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షీ ఘోయెల్ జంటగా నటించగా, రేసుగుర్రం ఫేమ్ రవి కిషన్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యంత ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటి. స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షీ ఘోయెల్ జంటగా నటించగా, రేసుగుర్రం ఫేమ్ రవి కిషన్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం, కమర్షియల్‌గా సూపర్ హిట్ అయి బాక్సాఫీస్‌ను దుమ్మురేపింది.
పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం, 75వ సుప్రీం కోర్టు స్థాపన దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించబడి ప్రత్యేక గౌరవం పొందింది. దర్శకురాలు కిరణ్ రావు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘లాపతా లేడీస్’ ఆస్కార్ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనే తమ బృందం కోరుకుంటున్నట్లు తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపించే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన కిరణ్‌రావు, 2011లో అమీర్‌ఖాన్ హీరోగా నటించిన ‘ధోభీ ఘాట్’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైంది.