Telugu Global
Cinema & Entertainment

మేకింగ్ తో అందర్నీ ఆకర్షించిన లాల్ సింగ్

లాల్ సింగ్ చడ్డా సినిమా నుంచి నాగచైతన్య నటించిన మేకింగ్ వీడియో రిలీజైంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఆ మేకింగ్ ఆకట్టుకుంది.

మేకింగ్ తో అందర్నీ ఆకర్షించిన లాల్ సింగ్
X

నాగ చైతన్య నటించిన తొలి బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చడ్డా, ఆగస్ట్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలా అనే పాత్ర పోషించాడు చైతూ. తన పాత్ర గురించి చెబుతూ, మేకింగ్ షాట్స్ తో ఓ వీడియో రిలీజ్ చేశాడు చైతూ. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

లాల్ సింగ్ (అమీర్ ఖాన్ ) భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు అతని స్నేహితుడిగా చైతూ నటించాడు. ఆ వీడియోలో చైతూ పలువురి పేర్లను ప్రస్తావించగా, చిత్ర బృందం బాలరాజు పేరును ఖరారు చేసింది. ఈ సినిమాలో తన పాత్ర పేరును బయటపెట్టిన చైతూ, ఆ పాత్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

ఫస్ట్ టైమ్ ఓ సినిమాలో తను భారీ మీసాలతో నటించానని ఆ అనుభవాలు పంచుకున్నాడు. ఇక నోరు ముందుకు వచ్చినట్టు ఉండడం కోసం ఏం చేశాడో కూడా చెప్పాడు. సినిమా లాస్ట్ డే షూట్ విశేషాల్ని కూడా వీడియోలో చూపించారు.

లాల్ సింగ్ చడ్డా సినిమాలో వచ్చీరాని హిందీ మాట్లాడాలంట నాగచైతన్య. కానీ ఈ నటుడికి హిందీ బాగా తెలుసు. దీంతో వచ్చిన హిందీని తగ్గించుకొని మరీ, ఏమీ రానట్టు ఈ సినిమాలో హిందీ మాట్లాడాడంట చైతూ.



First Published:  4 Aug 2022 10:30 AM IST
Next Story