Telugu Global
Cinema & Entertainment

Kushi Movie | ఖుషి సినిమా నుంచి రెండో పాట రెడీ

Kushi Movie - ఖుషీ మూవీ నుంచి సెకెండ్ సాంగ్ రెడీ అయింది. ఈరోజే ప్రోమో రిలీజ్ అవుతుంది.

Kushi Movie | ఖుషి సినిమా నుంచి రెండో పాట రెడీ
X

విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి, ఇప్పటికీ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ 'నా రోజా నువ్వే' అంటూ మేకర్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ్, సమంత ల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఖుషి చిత్రం నుంచి ఆరాధ్య అనే సాంగ్ ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సమంత, విజయ్ కూల్ గా కనిపిస్తున్నారు. ఒకరి చేతిని ఒకరు పట్టుకుని నవ్వులు చిందిస్తున్నారు.

ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రోమోను ఈరోజు రిలీజ్ చేస్తారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను బుధవారం రిలీజ్ చేస్తారు. ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాటు యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారింది. వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్ రాకతో ఖుషీ మూవీ మరోసారి ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ డైరక్టర్. శివ నిర్వాణ దర్శకుడు.

First Published:  10 July 2023 1:41 AM GMT
Next Story