Telugu Global
Cinema & Entertainment

Vishwambhara | చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు

Vishwambhara Movie - చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర. ఇప్పుడీ సినిమాలోకి ఓ బాలీవుడ్ నటుడు వచ్చి చేరాడు.

Vishwambhara | చిరంజీవి సినిమాలో బాలీవుడ్ నటుడు
X

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి మినిమం గ్యాప్ లో అప్డేట్స్ వస్తున్నాయి. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వంశీ-ప్రమోద్.

విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ను తీసుకున్నారు. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన కునాల్ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ నటుడు విశ్వంభరలో అడుగుపెట్టాడు.

విశ్వంభరలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. విశ్వంభరను సంక్రాంతికి జనవరి 10న విడుదల చేయబోతున్నారు.

First Published:  14 Jun 2024 5:38 PM GMT
Next Story