Telugu Global
Cinema & Entertainment

Kubera | కుబేర మూవీ షూటింగ్ అప్ డేట్స్

Kubera Movie - ధనుష్-నాగ్ హీరోలుగా నటిస్తున్న సినిమా కుబేర. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Kubera | కుబేర మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ శేఖర్ కమ్ముల కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. తాజాగా ఈ సినిమా యాక్షన్ మోడ్ లోకి ఎంటరైంది. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైంది. దీని కోసం ప్రత్యేకమైన సెట్ వేశారు.

ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన నటీనటులంతా పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జున ఇద్దరూ కొన్ని యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. వీళ్లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుంది. రష్మిక, జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీకి సంబంధించి మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

First Published:  2 Jun 2024 5:08 PM GMT
Next Story