Telugu Global
Cinema & Entertainment

Krithi Shetty - కస్టడీలో కామెడీ చేసిందంట

Krithi Shetty - కస్టడీ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులకు రిలీఫ్ అందిస్తుందని చెబుతోంది హీరోయిన్ కృతి శెట్టి.

Krithi Shetty - కస్టడీలో కామెడీ చేసిందంట
X

కృతి శెట్టి కామెడీని మనం కొంచెం చూశాం. బంగార్రాజు సినిమాలో అక్కడక్కడ ఆమె కామెడీ చేసింది. కస్టడీలో కూడా ఆమె కామెడీ చేసిందట. ఈ విషయాన్ని కృతి స్వయంగా బయటపెట్టింది. అయితే ఎమోషన్ కూడా ఉంటుందని చెబుతోంది.

"కస్టడీ కథలో నా పాత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. కథ సీరియస్ అవుతున్నప్పుడు నా పాత్ర దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. స్క్రీన్ ప్లే తో నా పాత్ర ప్రయాణిస్తూ ఉంటుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇది. నా పాత్ర నిడివి కూడా ఎక్కువే. సీరియస్ గా సాగుతున్న సినిమాలో ప్రేక్షకులకు నేను రిలీఫ్ అందిస్తాను."

ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందించలేకపోయింది కృతి శెట్టి. ఇదే అంశంపై స్పందిస్తూ, కథను నమ్మి సినిమాలు చేస్తానని, రిజల్ట్ తన చేతిలో ఉండదని స్పష్టం చేసింది కృతి. కస్టడీలో పాత్ర కోసం కూడా ప్రాణంపెట్టి పనిచేశానని, ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నానని తెలిపింది.

నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ శుక్రవారం తెలుగు-తమిళ భాషల్లో థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.

First Published:  7 May 2023 1:24 PM
Next Story