Telugu Global
Cinema & Entertainment

Chandamama 2 | చందమామ-2 వస్తుందా?

Chandamama Sequel - తెలుగులో సూపర్ హిట్టయిన సినిమాల్లో చందమామ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది? దర్శకుడు కృష్ణవంశీ ఏమంటున్నారు?

Chandamama 2 | చందమామ-2 వస్తుందా?
X

చందమామ.. కృష్ణవంశీ తీసిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా ఈ సినిమా తీసి హిట్ కొట్టాడు కృష్ణవంశీ. ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. కేఎం రాధాకృష్ణన్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.

నవదీప్, శివబాలాజీ, కాజల్, సింధు మీనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ సినిమా సీక్వెల్ పై తాజాగా స్పందించాడు దర్శకుడు కృష్ణవంశీ.

మురారి రీ-రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులతో సోషల్ మీడియాలో టచ్ లోకి వచ్చాడు కృష్ణవంశీ. ఈ సందర్భంగా చందమామ సీక్వెల్ పై ఓ నెటిజన్ ప్రశ్న అడిగాడు. దీనిపై కృష్ణవంశీ సూటిగా స్పందించాడు.

ఎట్టిపరిస్థితుల్లో చందమామ సినిమాకు సీక్వెల్ రాదని స్పష్టం చేశాడు ఈ దర్శకుడు. అసలు ఓ సినిమాకు సీక్వెల్స్ ఎలా తీస్తారో తనకు బొత్తిగా అర్థంకావడం లేదంటూ స్పందించాడు. కృష్ణవంశీ తాజా స్టేట్ మెంట్ తో చందమామ సీక్వెల్ పైనే కాదు, అతడి చిత్రాలన్నింటిపై క్లారిటీ వచ్చేసింది. తను సీక్వెల్స్ కు వ్యతిరేకం అనే విషయం అందరికీ అర్థమైంది.

First Published:  22 July 2024 4:58 PM IST
Next Story