Telugu Global
Cinema & Entertainment

Krishna Chaitanya: కృష్ణచైతన్య నుంచి మరో సినిమా

Katha Venuka Katha: కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా కథ వెనుక కథ. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Krishna Chaitanya: కృష్ణచైతన్య నుంచి మరో సినిమా
X

పాటల రచయితగా, కథా రచయితగా, డైలాగ్ రైటర్ గా, దర్శకుడిగా ఇండస్ట్రీలో కృష్ణ చైతన్యకు మంచి పేరుంది. ఇంతకుముందు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగ సినిమాలతో పేరు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తీశాడు కృష్ణచైతన్య. ఈ సినిమాకు కథ వెనుక కథ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా హైదరాబాద్ లో టైటిల్ లోగోను లాంచ్ చేశారు.

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది కథ వెనక కథ సినిమా. ఈ మూవీని కృష్ణచైతన్య డైరక్ట్ చేయడంతో పాటు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అందించాడు. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించాడు. అలీ, సత్యంరాజేశ్, జయప్రకాష్, రఘుబాబు, మధునందన్ లాంటి నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు శ్రవణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. త్వరలోనే సినిమా నుంచి లిరికల్ వీడియోస్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు.




First Published:  3 Dec 2022 9:00 AM IST
Next Story