Telugu Global
Cinema & Entertainment

KA Movie | "క" మూవీ టీజర్ లాంచ్

KA Movie Teaser - కిరణ్ అబ్బవరం చేసిన తొలి పాన్ ఇండియా మూవీ "క". ఈ సినిమా టీజర్ రిలీజైంది.

KA Movie | క మూవీ టీజర్ లాంచ్
X

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాతో పరిచయమౌతున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను ‌రూపొందిస్తున్నారు. "క" సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమం జరిగింది.

"క" టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే మంచి థ్రిల్ అందించింది. ఓ కోణంలో పోస్ట్ మ్యాన్ గా, మరో కోణంలో హంతకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు కిరణ్ అబ్బవరం. శ్యామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇకపై ఈ సినిమా ప్రచారం ఇలానే దశలవారీగా కొనసాగించాలని నిర్ణయించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ఎనౌన్స్ చేస్తారు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది.

First Published:  15 July 2024 4:55 PM GMT
Next Story