Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం సినిమాకు వెరైటీ టైటిల్
Kiran Abbavaram - కిరణ్ అబ్బవరం మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి పీరియాడిక్ థ్రిల్లర్ లో నటించాడు. సినిమా పేరు 'క'.

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు ఈ సినిమాకు "క" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు.
టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. కేఏ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
సుజీత్, సందీప్ ఈ సినిమాతో దర్శకులుగా పరిచయమౌతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
త్వరలో "క" సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న "క" సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.