Kiran Abbavaram - కిరణ్ అబ్బవరం మరో 'యాక్షన్' ప్రయత్నం
Kiran Abbavaram - మాస్-యాక్షన్ ఎలిమెంట్స్ తో మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం.

ప్రేమకథలు, విలక్షణ పాత్రల నుంచి మెల్లగా మాస్ రూట్ ఎంచుకుంటున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇందులో భాగంగా మీటర్ అనే పక్కా మాస్ మూవీ చేశాడు. ఇందులో అతడు పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఇదే కోవలో మరో యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అబ్బవరం.
కిరణ్ అబ్బవరం హీరోగా శివం సెల్యులాయిడ్స్ బ్యానర్ పై ఒక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు.
ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, శిరీష్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోదరప్రసాద్, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్ తదితరులు హాజరయ్యారు.
ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో 6 సినిమాలున్నాయి. వాటితో పాటు ఈ సినిమాను కూడా పూర్తిచేయబోతున్నాడు ఈ హీరో.