Telugu Global
Cinema & Entertainment

Kiran Abbavaram | పీరియాడిక్ మూవీలో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram periodic Movie - కెరీర్ లో తొలిసారి ఓ పీరియాడిక్ సినిమా చేశాడు కిరణ్ అబ్బవరం. షూటింగ్ కూడా పూర్తిచేశాడు.

Kiran Abbavaram | పీరియాడిక్ మూవీలో కిరణ్ అబ్బవరం
X

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఇది రాబోతోంది.

పోస్ట్ కార్డ్ పై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అభినయ వాసుదేవ్, సబ్ ఇన్స్ పెక్టర్ దీపాల పద్మనాభంకు రాస్తున్న లేఖను చూపించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11.01 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

ఈ సినిమాను వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సినిమా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

First Published:  8 July 2024 6:14 AM GMT
Next Story