ఘనంగా కిదాంబి శ్రీకాంత్ - శ్రావ్య వర్మల పెళ్లి
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ మేనకోడలు, సినీ నిర్మాత, సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రావ్య వర్మ, బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
BY Vamshi Kotas10 Nov 2024 4:56 PM IST
X
Vamshi Kotas Updated On: 10 Nov 2024 4:56 PM IST
భారత స్టార్ బ్యాడ్మింటన్ కిదాంబి శ్రీకాంత్ ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మేనకోడలు, టాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, క్రీడా ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. 2018లో శ్రీకాంత్ వరల్డ్ నెం.1 ర్యాంకు సాధించారు. దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, హీరోయిన్ రష్మిక, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ కీర్తి సురేశ్‌లతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story