Telugu Global
Cinema & Entertainment

Kiara Advani - హనీమూన్ లేదంటున్న కియరా

Kiara Advani - పెళ్లి తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టింది కియరా అద్వానీ.

Kiara Advani - హనీమూన్ లేదంటున్న కియరా
X

ఒకప్పుడు హీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకొని అలా హనీమూన్ కు వెళ్లేవారు. కానీ ఇప్పటి తరం హీరోయిన్లు అలా కాదు. ఇలా పెళ్లి చేసుకొని, అలా సెట్స్ పై వాలిపోతున్నారు. తాజాగా కియరా అద్వానీ కూడా అదే పని చేస్తోంది.

రీసెంట్ గా సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది కియరా అద్వానీ. రాజస్థాన్ లోని జైసల్మేర్ కు సమీపంలో ఉన్న స్టార్ రిసార్ట్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత ముంబయిలో సినీ-రాజకీయ ప్రముఖులకు పార్టీ ఇచ్చింది ఈ జంట.

ఈ రిసెప్షన్ తర్వాత ఇద్దరూ కలిసి ఎంచక్కా హనీమూన్ కు వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ కియరా మాత్రం హనీమూన్ కు వెళ్లడం లేదు. త్వరలోనే ఆమె శంకర్-చరణ్ సినిమాలో జాయిన్ అవ్వబోతోంది.

అటు సిద్దార్థ్ కూడా అంతే. ఈ వారాంతానికి అతడు కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమాతో పాటు, ఓ వెబ్ సిరీస్ కూడా మొదలుపెట్టబోతున్నాడు. ఇలా కొత్త భార్యాభర్తలిద్దరూ ఇలా పెళ్లి చేసుకొని, అలా కెరీర్ లో బిజీ అయిపోతున్నారు.

మొన్నటికిమొన్న అలియా భట్ కూడా అదే పనిచేసింది. రణబీర్ ను పెళ్లాడిన తర్వాత వెంటనే సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం హీరోయిన్లంతా కెరీర్ లో కొనసాగుతూనే, మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.




First Published:  15 Feb 2023 9:18 PM IST
Next Story