Telugu Global
Cinema & Entertainment

Kiara Advani: పెళ్లి చేసుకున్న కియరా అద్వానీ

Kiara Advani Siddardh Malhotra - బాలీవుడ్ ప్రేమపక్షులు కియరా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది.

Kiara Advani: పెళ్లి చేసుకున్న కియరా అద్వానీ
X

మరో హీరోయిన్ కు పెళ్లయిపోయింది. స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ నిన్న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన సహనటుడు, ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లాడింది. జైసల్మేర్ లోని ఓ స్టార్ రిసార్ట్ లో వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

షేర్షా సినిమా టైమ్ లో ఒకరికొకరు పరిచయం కియరా-సిద్దార్థ్. ఆ టైమ్ లోనే వాళ్ల మధ్య స్నేహానికి మించిన బంధం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అప్పట్నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పక్షలు, ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు.

మీడియాకు దూరంగా తన పెళ్లిని జరుపుకుంది కియరా. చిన్న సమాచారం కూడా ఇవ్వలేదు. నిజానికి మీడియా అంతా 6వ తేదీ పెళ్లనుకుంది. కానీ 7వ తేదీన పెళ్లి చేసుకుంది కియరా. అంతేకాదు.. తన పెళ్లికి సంబంధించి ఒక్క స్టిల్ కూడా లీక్ అవ్వకుండా జాగ్రత్త పడింది ఈ జంట.

ఎయిర్ పోర్ట్ లో కియరా దిగిన స్టిల్స్ తప్ప, ఇంకేం బయటకురాలేదంటే కియరా-సిద్ ఎంత జాగ్రత్తపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా ఫోన్ తీసుకురావద్దని గట్టిగా చెప్పారు. వాళ్ల గదుల్లోనే ఫోన్లు పెట్టేసి, పెళ్లి మంటపానికి రావాలని కోరారు. చివరికి పెళ్లయి, కియరా తన సోషల్ మీడియా పేజీలో ఫొటోలు పెట్టేవరకు ఎవ్వరికీ ఒక్క స్టిల్ కూడా దొరకలేదు.




First Published:  8 Feb 2023 9:28 AM IST
Next Story