Game Changer | ప్రేక్షకుల ఊహకు మించి ఉంటుందంట
Kiara Advani Game Changer - గేమ్ ఛేంజర్ సినిమా ఎవ్వరి ఊహలకు అందదంటోంది హీరోయిన్ కియరా అద్వానీ.

శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక పాత్రకు కియరా అద్వానీ హీరోయిన్ కాగా, మరో పాత్రకు అంజలని హీరోయిన్ గా తీసుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కెరీర్ లో దిల్ రాజుకు ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం.
గేమ్ ఛేంజర్ సినిమాపై కియరా అద్వానీ తాజాగా స్పందించింది. ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఈ సినిమా ఉంటుందని ప్రకటించింది. రెండేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, అందరం చాలా కష్టపడుతున్నామని తెలిపింది.
శంకర్ దర్శకత్వంలో నటించడం తన అదృష్టం అంటున్న కియరా, ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నట్టు వెల్లడించింది. ఇక సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ ఏడాది చివరినాటికి గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఇంతకుముందు చరణ్ తో వినయవిధేయ రామ సినిమాలో నటించింది కియరా అద్వానీ. అప్పటికీ ఇప్పటికీ రామ్ చరణ్ లో అదే ఎనర్జీ ఉందని తెలిపింది.
ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాను వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తానని గతంలోనే దిల్ రాజు చెప్పిన విషయం తెలిసిందే.