Telugu Global
Cinema & Entertainment

Keerthy Suresh: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కీర్తి సురేష్ సంచల వ్యాఖ్యలు

'ఒకవేళ ఎవరైనా కమిట్మెంట్ అడిగితే దానికి అంగీకరించను. సినిమాలు మానేసి ఉద్యోగం అయినా చేసుకుంటాను తప్ప ఆఫర్ల కోసం కమిట్మెంట్ ఇచ్చే రకం కాదు నేను.' అని కీర్తి సురేష్ కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Keerthy Suresh Comments on Casting Couch
X

Keerthy Suresh: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కీర్తి సురేష్ సంచల వ్యాఖ్యలు

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లతో పాటు అన్ని సినీ ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని గత కొన్నేళ్లుగా హీరోయిన్లు, నటీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎంతోమంది హీరోయిన్లు, నటీమణులు కెరీర్లో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మీడియా ముఖంగా తెలిపారు. అలాగే తమ కెరీర్‌లో ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదని చెప్పిన నటీమణులు కూడా ఉన్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించారు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె సంచలన కామెంట్స్ చేశారు.

మొదట బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 2013లో మలయాళంలో తెరకెక్కిన గీతాంజలి అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. మహానటి చిత్రంతో ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో స్టార్‌గా మారింది.

కాగా కీర్తి సురేష్ తొలిసారిగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఒక తమిళ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉన్న మాట నిజమేనని వ్యాఖ్యానించారు. 'సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. పలువురు తోటి హీరోయిన్లు ఈ విషయం గురించి నాతో చెప్పారు. వారికి ఎదురైన అనుభవాలను వివరించారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు నాకు ఎదురవలేదు. క్యాస్టింగ్ కౌచ్ మన ప్రవర్తన బట్టి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కమిట్మెంట్ అడిగితే దానికి అంగీకరించను. సినిమాలు మానేసి ఉద్యోగం అయినా చేసుకుంటాను తప్ప ఆఫర్ల కోసం కమిట్మెంట్ ఇచ్చే రకం కాదు నేను.' అని కీర్తి సురేష్ కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

First Published:  6 Dec 2022 2:00 PM IST
Next Story