Telugu Global
Cinema & Entertainment

Katrina Kaif | 2 నెలలు కష్టపడిన కత్రినా

Katrina Kaif - టైగర్ 3 కోసం 2 నెలల పాటు కఠోర శిక్షణ పొందినట్టు వెల్లడించింది కత్రినాకైఫ్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటోంది.

Katrina Kaif | 2 నెలలు కష్టపడిన కత్రినా
X

ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తోన్న స్పై యూనివర్స్‌లో తొలి లేడీ స్పై జోయా. ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపించింది.

ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 12న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకుడు. టైగర్ ఫ్రాంచైజీలో హీరో పాత్రకు ఏమాత్రం తీసిపోని విధంగా జోయా పాత్రను తీర్చిదిద్దారు. ఈ పాత్ర కోసం కఠోరమైన ట్రయినింగ్ తీసుకున్నానని వెల్లడించింది కత్రినా కైఫ్. దాదాపు 60 రోజుల పాటు ఆమె ట్రయినింగ్ తీసుకుంది.

"టైగర్ ఫ్రాంచైజీలో జోయా పాత్ర నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి 2 నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. అందుకు కారణం జోయా పాత్ర మరింత వేగంగా, బలంగా కనిపించాలనేదే. దాని కోసం చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లోనే ఇది కఠినమైన ట్రైనింగ్. నేను చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు మరెవ్వరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్‌తో కలిసి పని చేశాను. ఈ యాక్షన్ సన్నివేశాలను వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలని చాలా ఆతృతగా ఉంది"

ఇలా టైగర్-3లో జోయా పాత్ర కోసం పడిన కష్టాన్ని బయటపెట్టింది కత్రినాకైఫ్. హీరోయిన్లు కేవలం సాంగ్స్, లిప్ కిస్సులకు పరిమితమైన ఈ రోజుల్లో, ఇలాంటి పాత్ర దొరకడమే అదృష్టమని, జోయా లాంటి క్యారెక్టర్ ను పండించేందుకు ఎంత కష్టపడినా తప్పులేదని అంటోంది కత్రినాకైఫ్.

First Published:  31 Oct 2023 6:45 AM IST
Next Story