Telugu Global
Cinema & Entertainment

Kashmir Files: ఆస్కార్ బరిలో ది కశ్మీర్ ఫైల్స్

Kashmir Files - దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ అయింది. 300 చిత్రాల జాబితాలోకి ఇది కూడా చేరింది.

Kashmir Files: ఆస్కార్ బరిలో ది కశ్మీర్ ఫైల్స్
X

అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) ఈ ఏడాది ఆస్కార్‌ లకు అర్హత సాధించిన 301 చలన చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ కాకుండా, సంచలనాత్మక, వివాదాస్పద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్‌తో సహా మరో నాలుగు చిత్రాలు ఇందులో ఉన్నాయి.

ది కాశ్మీర్ ఫైల్స్ జాబితాలోకి రావడం పట్ల దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ది కాశ్మీర్ ఫైల్స్ ఆస్కార్ కోసం షార్ట్‌లిస్ట్ అవ్వడం, ఓటింగ్‌ కు అర్హత పొందడం, 300 చిత్రాల లిస్ట్ లోకి చేరడం చాలా ఆనందంగా ఉందన్నాడు. జనవరి 12 నుంచి 17వ తేదీ మధ్య ఓటింగ్ జరుగుతుంది.

విడుదలైన తొలి రోజుల్లో సినిమాకు చాలా తక్కువ స్క్రీన్‌లు కేటాయించారు. అయితే, ఈ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్‌ గా నిలిచింది ఇండియన్ సినిమాలో అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇది ఇంత హిట్టవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. చివరికి మేకర్స్ కూడా.

ఈ కథ 1990లలో భారత పాలిత కాశ్మీర్ నుండి కాశ్మీరీ హిందువుల వలసలు, నాడు జరిగిన మారణహోమాన్ని చూపించింది.

అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి కలిసి నిర్మించారు.

First Published:  12 Jan 2023 12:19 PM IST
Next Story