Karthik Ghattamaneni | అందుకే ఈగల్ కాన్సెప్ట్ చెప్పలేదంట
Karthik Ghattamaneni - ఈగల్ సినిమాతో మరోసారి దర్శకుడిగా మారాడు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని. ఈ సందర్భంగా రవితేజతో వర్కింగ్ అనుభవాన్ని షేర్ చేశాడు.

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని 'ఈగల్' విశేషాలని పంచుకున్నారు.
"ఈ కథకు సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యం. ఆ పాత్రల ద్వారా కథానాయకుడు ఎవరనే చెప్పే స్టయిల్ ని ఎక్స్ ఫ్లోర్ చేశాం. విరుమాండి, రషోమన్, విక్రమ్ తరహా శైలి ప్రయత్నించాం. కాన్సెప్ట్ అంతా ముందే చెప్పేస్తే ఆ ఎక్సయిట్మెంట్ పోతుంది. సినిమా చూశాకా మీరు ట్రైలర్ చూస్తే.. కాన్సెప్ట్ క్లియర్ గా ట్రైలర్ లోనే చెప్పామని అర్ధమైపోతుంది."
రవితేజతో వర్క్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుందంటున్నాడు కార్తీక్. ఆయన నుంచి క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోవచ్చని చెబుతున్నాడు. రవితేజ రెగ్యులర్ లైఫ్ లో టైమింగ్స్ అన్నీ పక్కాగా ఉంటాయని, ఆయన జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతారని అన్నాడు.