'సర్దార్' కష్టాన్ని బయటపెట్టిన కార్తి
సర్దార్ సినిమా కోసం తను పడిన కష్టాన్ని బయటపెట్టాడు కార్తి. ఈ సినిమా కోసం కొన్నిసార్లు రోజుకు 20 గంటలు కష్టపడ్డాడట.
కార్తి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్. మిత్రన్ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామంటున్నాడు కార్తి. రోజుకు 20 గంటలు కష్టపడి, మళ్లీ మరుసటి రోజు ఉదయాన్నే సెట్స్ కి వెళ్లడం సాధారణ విషయం కాదంటున్నాడు.
"సర్దార్ కోసం చాలా కష్టపడి పనిచేశాం. ఈ సినిమా కోసం ఒక వార్ లా పని చేశాం. ఇప్పుడు ప్రేక్షకుల నుండి సర్దార్ కి అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. మేము పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు ప్రేక్షకులు. పిఎస్ మిత్రన్ సినిమా కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రేక్షకులందరికీ అర్ధమయ్యేలా చెప్పడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఇక నేను ఈ సినిమా కోసం రోజుకి 20 గంటలు పని చేసి కూడా తర్వాత రోజు మళ్ళీ షూటింగ్ వెళ్లాను. దీనికి కారణం మిత్రన్ వర్కింగ్ స్టయిల్. చాలా ఎక్సయిట్ మెంట్ తో ఈ సినిమా చేశాం."
ఏదైనా విషయాన్ని బలంగా నమ్మి, మనస్ఫూర్తిగా కష్టపడితే కచ్చితంగా మంచి ఫలితం దక్కుతుందని.. ఆ విషయం సర్దార్ సినిమాతో మరోసారి రుజువైందని అన్నాడు కార్తి. దీపావళి కానుకగా థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్టవ్వగా, తెలుగులో సూపర్ హిట్ రేంజ్ టాక్ తెచ్చుకుంది.