Telugu Global
Cinema & Entertainment

Virupaksha - విరూపాక్ష ఐడియా అలా వచ్చింది

Virupaksha Idea - అసలు విరూపాక్ష సినిమాకు మూలం ఏంటి? ఆ ఐడియా ఎలా వచ్చింది?

Virupaksha - విరూపాక్ష ఐడియా అలా వచ్చింది
X

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష. అసలు ఈ సినిమా ఐడియా దర్శకుడు కార్తీక్ దండుకు ఎలా వచ్చింది. దెయ్యం లేకుండా ఓ హారర్ సినిమాను ఎలా తీయగలిగాడు. ఈ ప్రశ్నకు తనే స్వయంగా సమాధానం చెబుతున్నాడు కార్తీక్.

"సినిమాలో దెయ్యం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఈ జోనర్‌కి చిన్నప్పటి నుంచీ పెద్ద ఫ్యాన్‌. ఈ జోనర్‌లో ఈ మధ్యకాలంలో హారర్‌ కామెడీలు వస్తున్నాయే తప్ప, స్ట్రిక్ట్ హారర్‌ మూవీస్‌ రావడం లేదనిపించింది. అందుకే తీద్దామనిపించి తీశా. 2016, 2017లో ఓ పేపర్‌లో ఆర్టికల్‌ చదివా. గుజరాత్ లో ఓ మహిళ చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఓ చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథ రాద్దామని. నిజంగా ఆమెకు చేతబడి వచ్చి ఉంటే, వారందరూ చచ్చిపోయేవారేమో అనిపించింది."

ఇలా విరూపాక్ష సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన ఘటన గురించి చెప్పుకొచ్చాడు కార్తీక్ దండు. ఈ సినిమాకు కథ తనదే అయినప్పటికీ, సుకుమార్ తో కలిసి స్క్రీన్ ప్లే రాశాడు కార్తీక్. దాదాపు 6-7 వెర్షన్లు రాశారట. చివరికి వాటిలోంచి ఓ బెస్ట్ వెర్షన్ ను ఫైనల్ చేశారట. అదే విరూపాక్ష సినిమా.

ఇక సుకుమార్ ఇచ్చిన సలహాలు విరూపాక్ష క్లయిమాక్స్ కు బాగా పనికొచ్చాయని చెప్పుకొచ్చాడు కార్తీక్, అంతేకాదు, సాయిధరమ్ తేజ్ ఈ సినిమా చేయడానికి కారణం కూడా సుకుమారే అన్నాడు.

First Published:  25 April 2023 7:56 PM IST
Next Story