Telugu Global
Cinema & Entertainment

అమెజాన్ ప్రైమ్ 2024 కొత్త సినిమాలు, షోలు ఇవే!

ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 69 టైటిల్స్ తో కొత్త సినిమాలు, షోలతో కూడిన 2024 చిత్ర పటాన్ని ఆవిష్కరించింది.

అమెజాన్ ప్రైమ్ 2024 కొత్త సినిమాలు, షోలు ఇవే!
X

ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో 69 టైటిల్స్ తో కొత్త సినిమాలు, షోలతో కూడిన 2024 చిత్ర పటాన్ని ఆవిష్కరించింది. మంగళవారం ముంబాయిలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈవెంట్‌లో ఈ ఆవిష్కరణ జరిగింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అధినేత మైక్ హాప్‌కిన్స్ సహా ఎగ్జిక్యూటివ్ లు, సినిమా తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో పొందబోతున్న తదుపరి 250 మిలియన్ల మంది సభ్యుల్ని పరిశీలిస్తే, వీరు అమెరికా వెలుపలి నుంచే వస్తారని, భారతదేశంలోని కస్టమర్‌ల కోసం తాము నిజంగా మంచి కంటెంట్ ని అందిస్తే తప్ప వారిని ఆకట్టుకోలేమని, భారతదేశం తమకు కీలకమైన భౌగోళిక ప్రాంతమనీ హాప్‌కిన్స్ అన్నారు.

ప్రకటించిన చిత్రపటంలో- దక్షిణ భారత భాషా క్లస్టర్‌లో- పవన్ కళ్యాణ్ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’, పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘హరి హర వీర మల్లు’, రామ్ చరణ్ నటించిన ఎస్. శంకర్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ తెలుగు సినిమాలు, ధనుష్ నటించిన యాక్షన్ డ్రామా ‘రాయన్’, సూర్య టైమ్ ట్రావెలింగ్ ‘కంగువ’ తమిళ సినిమాలు, రిషభ్ శెట్టి నటించిన ‘కాంతారా’ కన్నడకి ప్రీక్వెల్ వున్నాయి.

ఇండియన్ ఒరిజినల్ సిరీస్ చిత్రపటంలో- వరుణ్ ధావన్ - సమంతా రూత్ ప్రభు నటించిన, హిట్ మేకింగ్ ద్వయం రాజ్ నిడిమోరు -కృష్ణ డికె దర్శకత్వంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వుంది. సిద్ధార్థ్ రాయ్ కపూర్ - నాగరాజ్ మంజులే ఆధ్వర్యంలో అక్రమ బెట్టింగ్ సిరీస్ ‘మట్కా కింగ్’, స్మితా సింగ్ అతీంద్రియ భయానక సిరీస్ ‘ఖౌఫ్’, భూమీ పెడ్నేకర్ సీరియల్ కిల్లర్ చిల్లర్ ‘దల్డాల్’; తమన్నా భాటియా, డయానా పెంటీ, జావేద్ జాఫ్రీ నటించిన ఆల్కహాల్ స్టార్టప్ కథ ‘డేరింగ్ పార్టనర్స్’, విలేజ్ కామెడీ ‘దుపాహియా’, ఇన్‌స్క్రిప్ట్ లేని షో ‘ఫాలో కర్లో యార్’, ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ నేతృత్వంలో జోయా అక్తర్, రీమా కగ్తీ, అయేషా సూద్ నిర్మించిన ‘ఇన్ ట్రాన్సిట్’ లతో బాటు, నైతికత పట్ల ఆలోచనల్ని అన్వేషించే ‘రంగీన్’, భారతదేశంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమ పుట్టుకని సూచించే ‘ది గ్రేట్ ఇండియన్ కోడ్’, భారతీయ స్వాతంత్ర్య సమరయోధులని అనుసరించి నిఖిల్ అద్వానీ నిర్మించిన ‘ది రివల్యూషనరీస్’, లాస్ ఏంజిలిస్ లోని భారతీయ ప్రభావశీలుల గురించి అంకుర్ తివారీ -స్వానంద్ కిర్కిరేల మ్యూజికల్ ‘బ్యాండ్ వాలే’, కామెడీ-డ్రామా ‘కాల్ మీ బే’ మొదలైన 27 వరకూ సిరీస్ కంటెంట్ వుంది.

ఇంకా ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ చిత్రపటంలో- అతీంద్రియ హార్రర్ మూవీ ‘ఇన్‌స్పెక్టర్ రిషి,’, పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ కురుతి పునల్’, కిడ్స్ యాక్షన్ ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ , సస్పెన్స్ డ్రామా ‘అరేబియా కడలి’, రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన టాక్ షో ‘ది రానా కనెక్షన్’’, హిందీ-భాషా కామెడీ-డ్రామా పంచాయత్’, తెలుగు, తమిళ భాషల్లో ‘శివరపల్లి’, ‘తలైవెట్టియాన్ పాలయం’ కూడా వున్నాయి.

ఎనిమిది అమెజాన్ ఒరిజినల్ మూవీస్ లో- అనిల్ కపూర్ యాక్షన్ డ్రామా ‘సుబేదార్’, రితేష్ సిధ్వాని, జోయా అక్తర్, రీమా కగ్తీ, ఫర్హాన్ అక్తర్ ల స్మాల్ టౌన్ కామెడీ ‘సూపర్‌మెన్ ఆఫ్ మాలేగావ్’, సారా అలీ ఖాన్ నటించిన భారత స్వాతంత్ర్య నేపథ్యపు ‘ఏ వతన్ మేరే వతన్’, అభిషేక్ బచ్చన్ నటించిన ‘బీ హ్యాపీ’, నటుడు బోమన్ ఇరానీ దర్శకత్వం వహించిన ‘ది మెహతా బాయ్స్’ తోబాటు ‘ఉప్పు కప్పు రంబు చీకటి లో’ అనే వ్యంగ్య సినిమా వున్నాయి.

పోతే, 29 లైసెన్స్ పొందిన చలనచిత్రాలు థియేట్రికల్ విడుదల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతాయి. వీటిలో రెండు కరణ్ జోహార్- ఎంజీఎం స్టూడియోస్ సహ-నిర్మాణాలు, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘యోధ’, విక్కీ కౌశల్ తృప్తీ త్డిమ్రీ నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ వున్నాయి.

ఇంకా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కొనసాగింపు -రణవీర్ సింగ్, అజయ్ దేవగన్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ లు నటించిన ‘సింగమ్ ఎగైన్’, 2018 లో హిట్టయిన హార్రర్-కామెడీకి సీక్వెల్ ‘స్త్రీ2’, వార్ మూవీ ‘ఇక్కిస్’, షాహిద్ కపూర్ –కృతీ సానన్ రోమాంటిక్ కామెడీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’, ఫ్రాంచైజీలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రనవీర్ సింగ్ నటించిన ‘డాన్ 3’ చిత్రపనాన్ని అలంకరించాయి.

ఇంకా కునాల్ ఖేమూ కేపర్ కామెడీ ‘మడ్గావ్ ఎక్స్ ప్రెస్’ కూడా వుంది. రితేష్ సిధ్వానీ-ఫర్హాన్ అక్తర్ ల యాక్షన్ థ్రిల్లర్ ‘అగ్ని’, ఇమ్రాన్ హాష్మీ నటించిన ‘గ్రౌండ్ జీరో’, కబీర్ ఖాన్ దర్శకత్వంలో, కార్తీక్ ఆర్యన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘చందూ ఛాంపియన్’, వరుణ్ ధావన్ నటించిన థ్రిల్లర్ ‘సంకీ’, షాహిద్ కపూర్ నటించిన ‘అశ్వత్థామ – ది సాగా కంటిన్యూస్’ వున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా వెలుపల ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారతదేశంలో ఎక్కువ మంది ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ ని సైన్ అప్ చేశారని, గత సంవత్సరం ప్రైమ్ మెంబర్స్ స్ట్రీమ్ ప్రైమ్ వీడియోని ప్రపంచంలోని ఏ దేశం కంటే భారత్ అత్యధిక శాతం యూజర్లని కలిగి వుందనీ హాప్‌కిన్స్ చెప్పారు. కాగా, 2023లో ఏ వారంలోనైనా 210కి పైగా దేశాల్లో భారతీయ కంటెంట్ ని వీక్షించారని, నిజానికి భారతీయ ప్రోగ్రామింగ్ గత 52 వారాల్లో పరిశీలిస్తే అందులో 43 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో టాప్ 10లో ట్రెండ్ అయ్యిందనీ ఆయన వెల్లడించారు.

First Published:  20 March 2024 1:45 PM IST
Next Story