Kamal Hassan Simbu - కమల్ హాసన్ నిర్మాతగా శింబు సినిమా
Kamal Hassan Simbu - కమల్ హాసన్, శింబు కాంబోలో సినిమా రాబోతోంది. అయితే కమల్ నిర్మాత, శింబు హీరో.

కమల్ హాసన్, శింబు చేతులు కలిపారు. అలా అని వీళ్లిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడం లేదు. తను నిర్మాతగా, శింబును హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు కమల్ హాసన్. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.
కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై హీరో శింబు హీరోగా సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం దేశింగ్ పెరియసామి. కన్నుమ్ కన్నుమ్ విజయం తర్వాత పెరియసామి చేస్తున్న సినిమా ఇదే.
రాజ్ కమల్ ఫిలింస్ బ్యానర్ పై ఇజి 56వ సినిమా. ఈ మూవీ కాకుండా.. కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో సినిమా.. శివకార్తికేయన్, సాయి పల్లవి కాంబోలో సినిమా కూడా ఈ బ్యానర్ పై రాబోతున్నాయి.
కమల్ తో కలిసి వర్క్ చేయడం శింబుకు ఇదే తొలిసారి. తన కల నెరవేరిందని, బాలనటుడి స్థాయి నుంచి సినిమాలు చేస్తున్న తను, కమల్ సర్ తో కలిసి వర్క్ చేసే రోజు కోసం ఏళ్లుగా ఎదురుచూశానని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.