Kamal Hassan | అవును.. నేనే విలన్
Kamal Hassan - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి-2898. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ప్రకటించారు.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్-కె. ఈ సినిమాకు తాజాగా “కల్కి 2898 AD” అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఆ పాత్ర విలన్ క్యారెక్టర్ అనే విషయాన్ని తాజాగా కమల్ హాసన్ కన్ ఫర్మ్ చేశారు.
“నేను అనలాగ్ ఫిల్మ్ యుగంలో పెరిగాను, నెగెటివ్ కాపీలతోనే పాజిటివ్ కాపీలు అందుబాటులో ఉండేవి. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అంటూ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తానని పరోక్షంగా వెల్లడించారు కమల్ హాసన్.
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 AD”. మరో ముఖ్యమైన పాత్రను లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. దిశా పటాని కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ ఇటీవలే టీమ్‌లో చేరారు. ఇప్పుడు విలన్‌గా నటిస్తున్నారని తేలిపోయింది.
కమల్ హాసన్ కు నెగెటివ్ రోల్స్ కొత్త కాదు. తను స్వయంగా నటించి నిర్మించిన "అభయ్" లో అతడిది నెగెటివ్ రోల్. అయితే అందులో హీరో కూడా అతడే. మరో నటుడు హీరోగా నటించిన సినిమాలో కమల్ ఇప్పటివరకు విలన్ గా చేయలేదు. “కల్కి 2898 AD”తో కమల్ ఈ ఫీట్ కూడా సాధించారు.