Telugu Global
Cinema & Entertainment

Indian 2 | మరోసారి వాయిదాపడిన భారతీయుడు 2

Kamal Haasan's Indian 2 - కమల్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమా భారతీయుడు-2. ఈ మూవీ మరోసారి వాయిదా పడింది.

Indian 2 | మరోసారి వాయిదాపడిన భారతీయుడు 2
X

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో దశాబ్దాల తర్వాత మరో సినిమా వస్తోంది. పైగా అది సీక్వెల్. దీంతో ఇండియన్-2 పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతోంది. గతేడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమాను వచ్చేనెల విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడింది.

భారతీయుడు-2 పేరిట తెలుగులోకి వస్తున్న ఈ సినిమాను జూన్ నుంచి పోస్ట్ పోన్ చేసి, జులైకి షిఫ్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై 18న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది కానీ, సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం పూర్తవ్వలేదు. దీంతో సినిమాను అనివార్యంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

భారతీయుడు సినిమా ఎక్కడైతే ముగిసిందో, సరిగ్గా అక్కడ్నుంచే భారతీయుడు-2 స్టార్ట్ అవుతుంది. ఇందులో సేనాపతిగా కమల్ హాసన్ కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సిద్దార్థ్, విలన్ గా ఎస్ జే సూర్య కనిపించబోతున్నారు.

అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా ఇదే.

First Published:  5 May 2024 4:10 PM GMT
Next Story