Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | మరోసారి కమల్ విశ్వరూపం

Kamal Haasan Bharateeyudu 2 - భారతీయుడు-2 విడుదలకు సిద్ధమైంది. తాజాగా ట్రయిలర్ వచ్చింది. కమల్ మరోసారి తన విశ్వరూపం చూపించారు.

Bharateeyudu 2 | మరోసారి కమల్ విశ్వరూపం
X

ఇన్నాళ్లూ భారతీయుడు-2 సినిమాపై ఉన్న అంచనాలు వేరు. ట్రయిలర్ రిలీజైన తర్వాత సినిమాపై ఏర్పడిన అంచనాలు వేరు. ట్రయిలర్ రిలీజ్ తర్వాత ఆకాశమే హద్దుగా భారతీయుడు-2పై అంచనాలు పెరిగిపోయాయి. విజువల్స్, ఫైట్స్, కమల్ హాసన్ గెటప్స్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, చూసేద్దాం అనే ఉత్సుకతలో ఉన్నారు ప్రేక్షకులు.

సేనాప‌తి తననుతాను ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా చెప్పుకుంటాడు. "ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను" అనే ప‌వ‌ర్‌ఫుల్, ఎమోష‌న‌ల్ డైలాగ్స్ ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో ఉన్నాయి. ఇక ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, అతడి గెటప్స్, శంకర్ మేకింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి.

‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌తో పాటు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక మ‌ర్మ‌క‌ళ‌తో విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డాన్ని కూడా ఈ సినిమాలో మ‌రింత విస్తృతంగా చూపించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, అనిరుద్ సంగీతం, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌లో ఆవిష్క‌రించాయి.

దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. ట్రయిలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఇండియన్ తాత అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

First Published:  26 Jun 2024 3:59 PM GMT
Next Story