Telugu Global
Cinema & Entertainment

Kamal Haasan | కీలక నిర్ణయం తీసుకున్న కమల్

Kamal Haasan - తమిళ బిగ్ బాస్ నుంచి కమల్ హాసన్ డ్రాప్ అయ్యారు. అందరికీ షాక్ ఇచ్చారు.

Kamal Haasan | కీలక నిర్ణయం తీసుకున్న కమల్
X

రాబోయే బిగ్ బాస్ సీజన్ కి తను హోస్ట్ గా వ్యవహరించనని కమల్ హాసన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఆయన ప్రకటనతో అభిమానులు షాక్ అయ్యారు. కమల్ హాసన్ కోసం అభిమానులు తమిళంలో బిగ్ బాస్ చూస్తుండగా, ఈసారి షోకి హోస్ట్ గా వ్యవహరించడం లేదని ఆయన ప్రకటించడం రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది.

7 సంవత్సరాల క్రితం బిగ్ బాస్ మొదటి సీజన్‌కి కమల్ హాసన్ హోస్ట్ చేయబోతున్నప్పుడు, చాలా మంది కమల్ హాసన్ సినిమా కెరీర్ ముగిసిందని అనుకున్నారు. అందుకే ఓ టీవీ షోలో హోస్ట్‌గా మారాడని పుకార్లు షికార్లు చేశాయి.

భారతీయుడు 2 సినిమా బిగ్ బాస్ మొదటి సీజన్‌తో ప్రారంభమై 7వ సీజన్ ముగిసిన తర్వాత థియేటర్లలో విడుదల కావడం గమనార్హం. ఎన్నో వివాదాలు, ఇబ్బందులను ఎదుర్కొంటూ బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తూనే సినిమాల్లో నటిస్తూ వచ్చారు కమల్. ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేస్తూ, ఇంకోవైపు బిగ్ బాస్ పనులు చూసుకునేవారు.

అయితే ఈమధ్య కాలంలో కమల్ సినిమాల పరంగా బిజీ అయ్యారు. కమల్ హాసన్ చేతిలో థగ్ లైఫ్, కల్కి 2, ఇండియన్ 3 వంటి సినిమాలున్నాయి. మరో 2 సినిమాలకు ఆయన సైన్ చేశారు. అందుకే బిగ్ బాస్ కు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదని ప్రకటించారు.

First Published:  6 Aug 2024 4:55 PM GMT
Next Story