Telugu Global
Cinema & Entertainment

Kalki movie | 39 ఏళ్ల తర్వాత కలిసిన లెజెండ్స్

Kalki - ఇద్దరు లెజెండ్స్. 39 ఏళ్ల తర్వాత కలిశారు. కల్కి సినిమాతో అది సాధ్యమైంది.

Kalki movie | 39 ఏళ్ల తర్వాత కలిసిన లెజెండ్స్
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది కల్కి సినిమా. ఈ సినిమాలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండ్స్ గా చెప్పుకునే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కలిసి కల్కిలో నటించడం పెద్ద విశేషం.

దాదాపు 39 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కల్కి కోసం కలిశారు. వీరిద్దరూ 1985లో వచ్చిన కల్ట్ మూవీ గిరఫ్తార్ లో కలిసి నటించారు. సోదరులుగా కరణ్, కిషన్ పాత్రలు పోషించారు. ఆ ఏడాది సెప్టెంబరు 13న రిలీజైన ఈ సినిమా కల్ట్ స్టేటస్ అందుకుంది.

గిరఫ్తార్ తర్వాత బిగ్ బి, కమల్ కలిసి చేసిన సినిమా కల్కి. ఇందులో కమల్ హాసన్ యాస్కిన్ పాత్రను పోషించగా.. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించనున్నారు. వీళ్లిద్దరి గెటప్స్ సూపర్బ్ గా క్లిక్ అయ్యాయి.

ఈ లెజెండరీ స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లు. విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ లాంటి తారలు గెస్ట్ రోల్స్ పోషించారు.

First Published:  26 Jun 2024 4:10 PM GMT
Next Story