Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | సినిమాపై కమల్ ఏమంటున్నారంటే..!

Bharateeyudu 2 - హైదరాబాద్ లో భారతీయుడు-2 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. కమల్ హాసన్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది.

Bharateeyudu 2 | సినిమాపై కమల్ ఏమంటున్నారంటే..!
X

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 12న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కమల్ హాసన్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.

"భారతీయుడు రిలీజ్ అయినప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం."

ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదంట. సెట్స్ లోకి సేనాపతి వచ్చాడంట. అంతలా కమల్ హాసన్ ఈ పాత్రలో లీనమైన నటించారంటున్నాడు దర్శకుడు శంకర్.

First Published:  8 July 2024 6:11 AM GMT
Next Story