Devil Movie | షెర్లాక్ హోమ్స్ టైపులో డెవిల్ మూవీ
Devil Movie - డెవిల్ మూవీ మంచి థ్రిల్లర్ అంటున్నాడు కల్యాణ్ రామ్. హాలీవుడ్ లో షెర్లాక్ హోమ్స్ తరహాలో ఉంటుందని చెబుతున్నాడు.
డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు.
"2021లో శ్రీకాంత్ విస్సా వచ్చి నాకు డెవిల్ కథను నెరేట్ చేశారు. అప్పుడు 1940 బ్యాక్ డ్రాప్‌తో సాగే ఆ కథలో హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా అనిపించింది. షెర్లాక్ హోమ్స్ సినిమాలను గమనిస్తే అందులో ఇన్వెస్టిగేటివ్ చేస్తుంటారు కదా.. ఆ తరహా సినిమా డెవిల్. కథ విన్న తర్వాత శ్రీకాంత్‌కి 2 విషయాలు చెప్పాను. హీరో క్యారెక్టర్, బ్యాక్ డ్రాప్ అలాగే ఉండనిచ్చి కమర్షియల్ పంథాలో స్క్రిప్ట్ లో మార్పులు చేస్తే సినిమా చేద్దామని అన్నాను. శ్రీకాంత్ 2-3 నెలలు కూర్చుని మార్పులు చేర్పులు చేశాడు. తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేశాం. దీనికి ఏడాది సమయం పట్టింది. మేకింగ్ కోసం మరో ఏడాది సమయం పట్టింది."
ప్రేక్షకులకు కొత్త సినిమాలు అందించాలనేదే తన తపన అంటున్నాడు కల్యాణ్ రామ్. ఒక్కసారి కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవుతుంటానని.. అమిగోస్ విషయంలో అదే జరిగిందని తెలిపాడు. డాపల్ గ్యాంగర్ అనే కొత్త కాన్సెప్ట్ తో అమిగోస్ తీశామని, కానీ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలనే ఆలోచన తనకు ఆరోజు రాలేదన్నాడు.
ఇక డెవిల్ సినిమాను పక్కా ఫిక్షనల్ స్టోరీగా చెబుతున్నాడు కల్యాణ్ రామ్. బ్రిటిష్ కాలానికి, తమ సినిమాకు ఎలాంటి లింక్ ఉండదని.. కేవలం దాన్ని ఓ నేపథ్యంగా తీసుకొని, ఓ కొత్త కథ చెప్పామని అన్నాడు. ఇన్వెస్టిగేటివ్ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉండటం తనకు కొత్తగా అనిపించిందంటున్నాడు.