Telugu Global
Cinema & Entertainment

Devil Movie | 90 డ్రెస్సులు ధరించిన కల్యాణ్ రామ్

Devil Movie - డెవిల్ మూవీలో ప్రత్యేకతల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు మేకర్స్. ఇందులో కల్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాడట.

Devil Movie | 90 డ్రెస్సులు ధరించిన కల్యాణ్ రామ్
X

క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బ్రిటిష్ కాలానికి చెందిన కథతో తెరకెక్కిన ఈ సినిమా కోసం భారీగా కాస్ట్యూమ్స్ వాడారు. ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ , క‌ళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం స‌రికొత్త‌గా ఉండేలా డిజైన్ చేశారు.

దీని గురించి కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ మాట్లాడుతూ ‘‘హీరో బ్రిటీష్ గూఢ‌చారిగా ప‌ని చేస్తుంటారు. ఆయ‌న పాత్ర ను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాల‌నుకున్నాను. డెవిల్‌లో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి ఉంటారు. ఆయ‌న కాస్ట్యూమ్స్‌లో భార‌తీయ‌త క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం’’ అన్నారు.

‘డెవిల్’ కాస్ట్యూమ్స్ హైలైట్స్‌ విషయానికొస్తే.. క‌ళ్యాణ్ రామ్ కోసం 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించారు. ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్‌ను ప్ర‌త్యేకంగా తయారు చేశారు. వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు. హీరోని స్టైల్‌గా చూపించే క్ర‌మంలో 25 ప్ర‌త్యేక‌మైన‌ వెయిస్ట్ కోట్స్‌ను ఉప‌యోగించారు.

హీరో వేసుకునే బ్లేజ‌ర్ జేబు ప‌క్క‌న వేలాడుతూ ఉండేలా ఓ హ్యాంగింగ్ వాచ్‌ను ప్ర‌త్యేకంగా త‌యారు చేశారు. పురాత‌న వాచీల‌ను సేక‌రించే వ్య‌క్తి డిల్లీలో ఉంటే అత‌ని ద‌గ్గ‌ర నుంచి ఈ హ్యాంగింగ్ వాచ్‌ను తీసుకురావ‌టం విశేషం.

First Published:  10 Dec 2023 8:58 PM IST
Next Story